అధికారం మనదే.. దాడులు చేసినా ముందుకు సాగుదాం

0
733

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలువురు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకట రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల తెరాస పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్. ఇలా చేస్తే హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా కూడా కెసిఆర్ కి బుద్ది రాలేదు.

కెసిఆర్ పద్దతి పట్ల వెగటు పుట్టి ఆ పార్టీ నేతలు బయటికి వస్తున్నారు. అలా వచ్చే వారిపై కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దు. భయపెట్టింది లొంగ దీసుకుంటాం అంటే తెలంగాణ సమాజం లొంగదు. టీఆర్ఎస్ ను ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నికల ముందో తరువాతనో కలిసిపోతాయి.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనో నిబ్బరం కోల్పోవద్దు. ఇన్నేళ్లు పని చేసారు ఇంకో 6 నెలలు కష్టపడి పనిచేయండి అధికారం మనదే.. ప్రజాసంగ్రామ యాత్రపై దాడులు చేసినా ఎవరూ అధైర్య పడవద్దు అన్నారు ఈటల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here