ప్రైవేట్‌ స్కూళ్ల అనుమతుల కోసం నయా పాలసీ.. ఇక, ఈజీగా..!

0
79

ప్రైవేటు స్కూళ్ల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ.. దరఖాస్తు చేసుకోవటానికి ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది… ఈ రోజు విజయవాడలో టెన్త్‌ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా ప్రైవేట్‌ స్కూళ్ల అనుమతుల కోసం రూపొందించిన కొత్త పోర్టల్‌ను లాంచ్ చేశారు.. ఇప్పటి వరకు మ్యాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. దీనిలోని లోపాలను అధిగమించటానికి ఆన్ లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు.. దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ను ట్రాక్ చేసే సౌలభ్యం ఉంటుంది.. ప్రైవేటు స్కూళ్ల అనుమతి, రిజిస్ట్రేషన్, రెన్యువల్ వంటి పలు అంశాలను ఈ పోర్టల్‌లో పొందుపర్చారు.. సింగిల్ విండో ఆన్ లైన్ పోర్టల్‌గా ఇది ఉపయోగపడనుంది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మొత్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.. పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా సత్తా చాటారు బాలికలు.. ఈ ఏడాది బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతం.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. ఇక, 933 స్కూళ్లల్లో వంద శాతం పాస్.. 38 స్కూళ్లల్లో సున్నా శాతం ఫలితాలు.. ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణత.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా ఉత్తీర్ణత 60.39 శాతం.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం ఉత్తీర్ణత ఉంది.. మరోవైపు ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించారు మంత్రి బొత్స.. దీని కోసం ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక, ఈ ఏడాది పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం స్కూళ్ళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రి బొత్స.. మరోసారి చదివి పాస్ అయ్యేందుకు ఈ క్లాస్‌లు దోహదపడతాయని తెలిపారు మంత్రి బొత్స.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here