బియ్యం బ్లాక్ మార్కెట్ కి తెరతీసిందే వారిద్దరూ.. ఎంపీ అర్వింద్

0
693

మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ రైతు ధర్నాలో ఎంపీ అర్వింద్ కేసీఆర్ సర్కార్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు..బాల్కొండ నియోజక వర్గంలో పసుపు రైతులకు మంత్రిగా నువు ఏంచేసావో చెప్పు..ఎంపీగా ఎన్నికైన 5 నెలల్లోనే పసుపు సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించాను.. స్పైస్ బోర్డు ఎక్కటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, రూ.30 కోట్ల రూపాయల నిధులు తెచ్చాను.. తాను ఎంపీగా ఎన్నికయ్యాక పసుపుకు గతం కంటే అధిక మద్దతు ధర ఇచ్చాం అన్నారు ఎంపీ అర్వింద్.

నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపు బోర్డు పేరుతో కాలయాపన చేసింది.. తాను ఎంపీగా అయ్యాక పసుపుకు అధిక ధర, అధిక బాయిలర్లు, టార్పాలిన్లు ఇచ్చాము.. పసుపు దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచాం.. నిజామాబాద్‌ నుండి పసుపుని విదేశాలకు ఎగుమతి చేసాం. రైతు బంధు ఇచ్చి రైతులను మభ్య పెడుతున్నారు.. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంటే , రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లల్లో రాష్ట్రం నయా పైసా ఖర్చు చేయలేదు. ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన బియ్యంతో బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ దేనని విమర్శలు చేశారు అర్వింద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here