పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో విషాదం నింపింది. పిల్లలు సహ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. నుజేండ్ల మండలం తెల్లబాడుకు గ్రామానికి చెందిన సౌజన్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో గడ్డి మందు తాగించి, తాను ఆత్మహత్యకు యత్నించింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. పిల్లలు శివ పార్వతి, 9 నెలల మనితేజకు ముందుగా గడ్డి మందు తాగించింది. ఆ తర్వాత తాను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఇరుగుపొరుగు వారు గమనించి నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి సౌజన్య లక్ష్మి, బాబు మనితేజ మృతి చెందారు. పాప శివ పార్వతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు గడిస్తే గాని పాప సంగతి చెప్పలేమని వైద్యులు తెలియజేశారు.