మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధాను ప్రకటించారు.. ఇక, ఈ ఎన్నికలపై ఆదినుంచి టెన్షన్ నెలకొంది.. ఏడు స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని అధికార వైసీపీ నేతలు చెబుతూ రాగా.. ఆ ఒక్కటి మాదే.. అని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.. మొత్తంగా 23 ఓట్ల రావడంతో టీడీపీ అభ్యర్థి అనురాధ విక్టరీ కొట్టారు..
ఈ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిన అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు.. ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏడుగురిని బరిలోకి దింపితే.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు మినహా మిగతా ఆరుగురు విజయం సాధించారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలుగా మర్రి రాజశేఖర్, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయ మంగళ వెంకటరమణ విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది..