లగేజీ బ్యాగ్‌లో పాములు.. ప్యాంట్లు తడుపుకున్న అధికారులు

0
129

తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 5 విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. లగేజీ బ్యాగ్‌లో పాములను చూసి అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ కేటుగాడు కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా థాయ్‌లాండ్ నుంచి పాములను లగేజీ బ్యాగ్‌లో దాచే ప్రయత్నం చేశాడు.

కానీ విమానాశ్రయంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పాముల గుట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాములను ఎందుకు తీసుకొచ్చాడో ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here