వీడి తెలివి చూశారా.. ట్రాలీ బ్యాగ్‌ హ్యాండిల్‌లో రూ.64 లక్షలు

0
385

బంగారం, డ్రగ్స్, ఫారెన్ కరెన్సీలను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. వాటన్నింటినీ కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. అయినా ఎప్పటికప్పుడు వారు రూట్ మార్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఒక వ్యక్తి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. తన ట్రాలీ బ్యాగ్‌ హ్యాండిల్‌లో రూ.64 లక్షల విలువైన విదేశీ కరెన్సీని దాచాడు. దీనిని పసిగట్టిన కస్టమ్స్‌ అధికారులు ఆ నోట్లను బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చెకింగ్‌ సిబ్బందిని డైవర్ట్‌ చేసేందుకు అతడు శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ డిపార్చర్‌ వద్ద ఉన్న కస్టమ్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అతడి ట్రాలీ బ్యాగ్‌ను ఎక్స్‌రే స్కానర్‌తో తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్‌ హ్యాండిల్‌లో విదేశీ కరెన్సీ ఉన్నట్లు కస్టమ్స్‌, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి అందులో దాచిన విదేశీ నోట్లను సూది, దారం సహాయంతో బయటకు తీశారు. 68,400 యూరోల విలువైన 200 డినామినేషన్‌ ఉన్న 342 నోట్లు, 5,000 న్యూజిలాండ్ డాలర్ల విలువైన 100 డినామినేషన్‌ ఉన్న 50 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. భారత కరెన్సీలో వీటి విలువ రూ.64 లక్షలు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. విదేశీ కరెన్సీ కలిగిన వ్యక్తిని సురీందర్ సింగ్ రిహాల్‌గా గుర్తించారు. దీనిపై దర్యాప్తు కోసం కస్టమ్స్‌ అధికారులకు అతడ్ని అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here