ఏపీలో ఉండలేం.. తెలంగాణలో కలిపేయండి..

0
54

భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం, ఏపీ చాలా దూరంగా ఉందని.. అందువల్ల తమను తెలంగాణ ప్రాంతం అయిన భద్రాచలంలో కలపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే వీరి సమస్యను విన్న గవర్నర్ ఐదు గ్రామాల ప్రజల పరిసస్థితి విన్నానని.. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం తాను ప్రభుత్వాలతో మాట్లాడతునానని అన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడ చర్చిస్తానని చెప్పారు.

ఆదివాసీలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా.. అభివృద్ధి చేయడంలో అందరం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు గవర్నర్‌ తమిళిసై.. నా వంతుగా రాజభవన్ నుండి మీ ఆరోగ్య రక్షణకు అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వడం ఆనందంగా ఉందన్న ఆమె.. ఒక డాక్టర్ గా మీ అందరికి ఆరోగ్య పరీక్షలు నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఎవరు బాగుపడాలన్నా,, ఎవరు అభివృద్ధి చెందాలన్నా.. విద్య చాలా అవసరం.. ఆదివాసి పిల్లలకు నేటి వరకు నాణ్యమైన విద్య అందుబాటు లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఆదివాసీలు ఎదగడానికి విద్య పనిచేస్తుందన్న ఆమె.. ఆదివాసీలకు ఆరోగ్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది, సరైన పోషకాహారం అందక వారు బలహీనులుగా మిగిలిపోతున్నారని.. వారికి నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపడతానని హామీనిచ్చారు.. అసమానతలు నిర్మూలించి అందరూ సమానంగా జీవించే విధంగా పనిచేస్తామన్నారు గవర్నర్‌ తమిళిసై.

ఇక, భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్బంగా గిరిజనులతో మమేకం అయ్యారు. గిరిజనుల యువతులతో కలసి నృత్యం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కర్తవ్యంగా కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ ఉన్న ఐదు విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని తన దృష్టికి తీసుకొచ్చారు.. వారికి వైద్యం, ఇతరాత్ర సదుపాయాల గురించి తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడ
తీసుకెళ్తానని తెలిపారు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here