ఏపీలో ముందస్తు లేదు.. ఎన్నికలు అప్పుడే

0
74

ఎన్నికలు గడువుకంటే ముందే వచ్చే అవకాశమే లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇంకా సంవత్సరం ఉంది. 175 స్థానాల్లో జనసేన కు ఎన్ని సీట్లు ఇస్తున్నాడో చంద్రబాబు చెప్పాలి. నారాయణ కమ్యూనిస్టు పార్టీని చంద్రబాబు కు తాకట్టు పెట్టాడు. రాహుల్ గాంధీకి ఎన్ని ఇస్తున్నావ్. బీజేపీ లో ఉన్న ఆదినారాయణ రెడ్డి వంటి టీడీపీ నేతలకు ఎన్ని సీట్లు ఇస్తున్నావ్. 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదు. ఇంత మంది కలిసి వస్తే గాని పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాగా చంద్రబాబు కూడా సినిమా డైలాగులు రాయించుకున్నట్లు ఉన్నాడు అని మండిపడ్డారు.

చంద్రబాబు వై నాట్ పులివెందుల అంటున్నాడు. రండి… చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని పులివెందుల నుంచి పోటీ చేయండి. నేను ఆహ్వానిస్తున్నాను. కలిసి పోటీ చేసినా… విడివిడిగా పోటీ చేసినా సరే. జగన్ ను ఓడించగలం అనే ధైర్యం ఉంటే రండి. 21 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే నాలుగు గెలిచి ప్రపంచాన్ని గెలిచినట్లు సంబరాలు చేసుకున్నాడు చంద్రబాబు. చంద్రబాబువి ఉత్తర కుమార ప్రగల్భాలు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసి అద్దె మైకు గాళ్ళను పిలిచి మాట్లాడించాడు అన్నారు.

ముఖ్యమంత్రి గురించి వీళ్ళు అసభ్యంగా కారుకూతలు కూస్తున్నారు. బీజేపీ 2018లో కర్నూలు డిక్లరేషన్ చేసింది. కర్నూలును రెండో రాజధాని చేయాలి అన్నారు. 2019లో బీజేపీ మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు లు ఏర్పాటు చేస్తాం అన్నారు. పువ్వు గుర్తు వాళ్ళకు సిగ్గు, శరం ఉండదా??మా ప్రభుత్వం వస్తే కర్నూలే రాజధాని అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్లు ఇచ్చాం అని చెప్పింది. అయినా ఒక్క భవనాన్ని టీడీపీ ప్రభుత్వం కట్టలేదని చెప్పారు. బీజేపీ నేతలకు వాళ్ళ మ్యానిఫెస్టోలో ఏం ఉందో తెలుసా?కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వాళ్ళ జెండాకు తూట్లు పొడుస్తున్నారు. 2024లో కూడా జగన్ ప్రభుత్వం రాబోతోంది

ఎమ్మెల్యేలు టచ్ లో ఉండటానికి ఇదేమైనా గేర్ బండా. టచ్ లో ఉంటే తీసుకుని వెళ్ళండి.రేపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష మాత్రమే జరుగుతుంది. మంత్రి వర్గంలో మార్పు జరిగే ప్రసక్తే లేదు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ తోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ క్యాబినెట్ తోనే ఎన్నికలు గెలుస్తున్నాం. మీడియా, సోషల్ మీడియా లో రేటింగ్, వ్యూస్ కోసమే మంత్రి వర్గం లో మార్పు అనే వార్తలు వస్తున్నాయి. పార్టీ ఇచ్చిన పని సక్రమంగా నిర్వర్తించకపోతే జగన్ కోప్పడకుండా ఎలా ఉంటారు. వచ్చే ఏడాది మార్చి తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు పేర్ని నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here