ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ రసకందాయంగా నడుస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఆస్కార్ ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ కే వచ్చే ఉండేది. మరో నామినేషన్ కూడా వచ్చి ఉండేది కాదు.హరిరామ జోగయ్య ను చూస్తే జాలేస్తోంది.పవన్ కళ్యాణ్ నెలలో రెండు రోజులే కదా ఇక్కడ ఉండేది. మిగిలిన రోజులన్నీ తెలంగాణలోనే ఏడుస్తావ్ గా. తెలంగాణ లో ఎందుకు ప్రశ్నించవు?? కేసీఆర్ ను ఎందుకు నిలదీయవు?? అని ప్రశ్నించారు పేర్ని నాని.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ నాలుకకు నరం ఉండదు..ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదు. కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లు కలిస్తే ఈ ప్రభుత్వం మారిపోతుందట. ప్రభుత్వం ఎందుకు మారాలి??ఎవరి చేతుల్లోకి అధికారం వెళ్ళటానికి మారాలి??తన లబ్ది కోసం, ఆనందం, తృప్తి కోసం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు పవన్ కళ్యాణ్ కు. మా నాన్న కాపు, అమ్మ బలిజ అని కొత్తగా చెబుతున్నాడు. నోరు విప్పితే అబద్ధాలు. రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తాడు. నాకు కులం లేదంటాడు… కాసేపు రెల్లి అంటాడు, కాపు అంటాడు. ప్రజాసేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నీకు కులంతో ఏం పని?? అని పేర్ని నాని ప్రశ్నించారు.
ప్రజా నాయకులకు కులంతో పని ఉండదు.హరిరామజోగయ్య కు పవన్ కళ్యాణ్ టోపీ పెట్టాడు. ప్రజలు అమాయకులు కాదు.. టోపీలు పెట్టించుకోవటానికి. 2024 మార్చి కల్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముసుగు బయటపెట్టక తప్పదు. ప్రతి కాపు నాకు ఓటు వేసి ఉంటే నేను ఓడిపోయే వాడిని కాదని పవన్ కళ్యాణ్ అనటం అతని దౌర్భాగ్యం. ఒక కులం ఓట్లతో గెలిచే వారు కుల నాయకుడు అవుతాడు, ప్రజా నాయకుడు కాదు. కమ్మవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడు. రాజశేఖరరెడ్డి కుటుంబానికి, సీమ బలిజలకు విడదీయరాని అనుబంధం వుందన్నారు. చంద్రబాబు కోసం జగన్ పై పవన్ విషం చిమ్ముతున్నాడు.
హరిరామజోగయ్య ఇంటికి వైఎస్సార్ కాంగ్రెస్ గూండాలను పంపించారని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అదే నిజం అయితే హరిరామజోగయ్య వైసీపీ లో ఎందుకు చేరారు?? ఏడాదే కదా… అన్నీ చూస్తాం. కాపులకు, బీసీలకు, కాపులకు ఎస్సీలకు గొడవలు ఎక్కడ ఉన్నాయి??2014 నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊడిగం చేస్తున్నాడు. మేమంతా జగన్ కి కార్యకర్తలం. బీసీ సభకు వచ్చిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఊడిగం చేయటానికి వచ్చారా? మా అమ్మను తిట్టి ఉంటే జగన్ తో నాకు సంబంధం ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం తన నోటితోనే తన తల్లిని టీడీపీ వాళ్ళు తిట్టారని చెప్పాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు పల్లకి మోస్తాడు. దీన్నే ఊడిగం చేయటం అంటారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.