కుక్కల దాడులు చేయడం సాధారమే. వీధి కుక్కలు దాడి చేసినప్పుడు కొన్నిసార్లు తప్పించుకోలేము, కానీ పెంపుడు కుక్కలు వ్యక్తులపై దాడి చేసిన సందర్భాలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఆ కుక్కు యజమానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ డెలివరీ పరిస్థితి చూసి చలించిపోతున్నారు.
థానేలోని పన్వెల్ ప్రాంతంలో భోజనం ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్‌కు పార్సిల్ ఇవ్వడానికి జొమాటో డెలివరీ బాయ్ వెళ్లాడు. తర్వాత లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడే ఉన్న ఓ కుక్క ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కరిచింది. వెంటనే గమనించిన స్థానికులు.. అతడ్ని డీవై పాటిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆగస్టు 27న జరిగింది. ఈ వైరల్ అయిన వీడియోలో కుక్క ఆగ్రహానికి గురై డెలివరీ బాయ్ ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసినట్లు కనిపించింది. డెలివరీ బాయ్ నొప్పితో ఎంతో బాధపడడంతో పాటు.. ఆ భాగమంతా రక్తం తడిచిపోయింది. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆ డెలివరీ బాయ్‌ను చూసి నెటిజన్లు ఎంతో బాధపడ్డారు. అయ్యో పాపం.. అంటూ అతనిపై జాలి చూపించారు. ఆ కుక్క యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిలో జైలులో వేయాలంటూ డిమాండ్ చేశారు.
A pet dog bites a Zomato delivery boy on 'private part' in Panvel, #Mumbai #ViralVideo #India pic.twitter.com/GqLJbGmo3H
— The Viral Finder (@TheViralFinder) September 9, 2022