గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు.. ఏ దిక్కుకైనా వెళ్లవచ్చు దిక్కుమాలిన బాబు వైపు తప్ప..!

0
181

చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సినీ నటుడు, దర్శక నిర్మాత, ఏపీఎఫ్సీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.. విజయవాడలో వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్ విజ్ఞాన్‌ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించారు.. ముఖ్య అతిథులుగా సినీ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి హాజరు అయ్యారు.. మాజీ మంత్రి వెల్లంపల్లి, పేర్నినాని, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు పోసాని.. ఏ కులం వారితో అయినా స్నేహం చేయవచ్చు.. దేశంలో గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.. దేశంలో ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు.. కానీ, దిక్కుమాలిన చంద్రబాబు వైపు వెళ్ళకండి అని సూచించారు.. మూడు సార్లు గుండె పోటు వస్తే ఎన్టీఆర్ ను ప్రాణంలా చూసుకున్నారు లక్ష్మీపార్వతి అని గుర్తుచేసిన ఆయన.. ఎన్టీఆర్ తో పెళ్ళి తర్వాత లక్ష్మీ పార్వతి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో లక్ష్మీ పార్వతిని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు.. ఎన్టీఆర్ ను బతికించుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పోసాని కృష్ణమురళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here