సాంకేతిక శిక్షణ, సహకారానికి ప్రమాణ్ 2కె23

0
84

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ప్రమాణ-2కె23 సచివాలయాలన్ని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కరుణాకర్.బి., స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ లు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గీతమ్ ప్రతియేటా మూడు రోజుల పాటు సాంకేతిక సాహిత్య-నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్, సింఫోనీ, కన్సర్ట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, కార్నివాల్, పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ప్రమాణ కార్యాలయాన్ని ఆరంభించిన సందర్భంగా ప్రొఫెసర్ సీతారామయ్య మాట్లాడుతూ, నూతన సాంకేతికత మేళవింపుతో కార్యక్రమాలను ఎంపికచేసి, ఇతర కళాశాలల విద్యార్థులు విరివిగా పాల్గొనేలా వాటిని రూపొందించమని సూచించారు. విశ్వస్థాయి ప్రమాణాలతో గీతం ప్రమాణ 2కే23ని నిర్వహించాలని, జంట నగరాల చుట్టుపక్కల విద్యార్థులనే కాకుండా విశ్వవ్యాప్తంగా లేదా దేశ నలుమూలల ఉన్న సాంకేతిక కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ప్రొఫెసర్ కరుణాకర్ ఉద్బోధించారు.

ప్రమాణ ద్వారా యాజనూన్య మెళకువలను నేర్చుకోవచ్చన్నారు. గత ఉత్సవాల కంటే ఈ ఏడాది ప్రమాణ -2కే23 మేటిగా ఉండేలా తీర్చిదిద్దమని ప్రమాణ నిర్వాహకులు డాక్టర్ సి.త్రినాథరావు, డాక్టర్ రూపాలత, స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్లు సూచించారు. వివిధ విభాగాధిపతులు, పలువురు అధ్యాపకులు, విద్యార్ధులు ప్రమాణ 2కె23 కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఈ సందర్భంగా నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here