ప్రధాని మోదీ సభకు.. విశాఖ సర్వం సిద్ధం.. ట్రాఫిక్ ఆంక్షలు

0
717

ప్రధాని మోదీ సభకు విశాఖ సర్వం సిద్ధమైంది. ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా… ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట‌్లన్నీ పుర్తయ్యాయి. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే ఆశీనులవుతారు. విశాఖ సభా వేదిక నుంచి ప్రధాని మోదీ సుమారు.. 15 వేల 233 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. 106కోట్లతో వైర్ లెస్ కాలనీ దగ్గర జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణంకు అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. వాల్తేర్ డివిజన్ భవిష్యత్ పై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

డివిజన్ తో కూడిన రైల్వేజోన్ కోసం బలంగా వినిపిస్తున్న డిమాండ్ పై మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటున్నారు. మోడీ బహిరంగ సభ ప్రధాన వేదికపై నలుగురికే అవకాశం ఉంది.ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే ఆశీనులవుతారు. బహిరంగ సభ వేదికపై అతిథుల కోసం 3 వేదికలు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదికపై మోడీ, సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రమే ఆశీనులవుతారు. రెండో వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీవీఎల్, సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ సహా 15 మంది బీజేపీ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. రెండువేదికలకు సమీపంలో 300 మంది కూర్చునేవిధంగా మరో వేదిక వుంది.

ఉదయం 8 గంటలకు ప్రధానిని… గవర్నర్, సీఎం కలిశారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ముగ్గురూ హెలికాప్టర్‌లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మందిని తరలిస్తున్నారు. 4 వేల బస్సులు, పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాట్లు చేశారు. 8 వేల 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా విశాఖలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బహిరంగ సభ నేపథ్యంలో భారీ వాహనాలను సిటీలోకి అనుమతించడం లేదు. వాటిని పెందుర్తి మీదుగా శ్రీకాకుళం హైవే వైపు ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు. ప్రధాని బహిరంగసభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని విశాఖ సీపీ శ్రీకాంత్ తెలిపారు. ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య ఆంక్షలు అమలు కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here