ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భూమిలోని నీటిని తోడితే ట్యాక్స్

0
459

రాజులు, బ్రిటీషర్ల కాలంలో విచిత్రమైన పన్నులు ఉండేవని విన్నాం.. పుస్తకాల్లో చదువుకున్నాం కానీ.. ప్రస్తుతం మళ్లీ అలాంటి రోజులే రాబోతున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిత్యం పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ ప్రజలు బతకడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెలామణి అవుతున్నప్పటికీ ఇంకా చాలా మంది ఒక్క పూట అన్నానికి కూడా నోచుకోని వారున్నారు. ఈ క్రమంలో ఒక పూట తిని రెండో పూట నీరు తాగిపడుకుందామనుకునే వారికి కూడా ప్రభుత్వాలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.. తాజాగా పంజాబ్‌లోని భగవంత్ మాన్ సర్కార్ రైతులకు, ఇతర వర్గాలకు షాకిచ్చింది. భూమిలోంచి నీటిని తోడితే పన్ను విధిస్తామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

దీనికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. భూగర్భ జలాన్ని కాపాడేందుకు వీలుగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజలకు ఈ విషయంలో చిన్న వెసులుబాటు కల్పించింది సర్కార్. వ్యవసాయానికి, ఇంటి తాగునీటి అవసరాలకు వినియోగిస్తే ఎలాంటి పన్ను విధించబోమని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రభుత్వ నీటి పంపిణీ పథకాలు, సైనిక బలగాలు, పుర, నగర పాలక, పంచాయతీ రాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, అభివృద్ధి మండళ్లు, ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపు కల్పించారు. మిగిలిన వారు మాత్రం భూగర్భ జలాల్ని వాడుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్‌లో భూగర్భ జలవనరులు నానాటికీ అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే భగవంత్ మాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here