Dispute: ‘భోలా’ తెచ్చిన గోల.. సినిమా నచ్చలేదని భార్యను కొట్టిన భర్త

0
100

Dispute: గుజరాత్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. భార్యభర్తలు కలిసి అజయ్ దేవ్ గన్ నటించిన భోలా సినిమాకు వెళ్లారు. అయితే సినిమా చూశాక భర్త షాక్ అయ్యాడు. అతనికి ఆ సినిమా నచ్చలేదు. దీంతో సినిమా హాలు నుంచి బయటకు రాగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కారణంగా భార్యను భర్త తీవ్రంగా కొట్టడంతో గొడవ చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని నగ్రకచల ప్రాంతంలో నివసించే కృష్ణబా, ఆమె భర్త అమర్‌సింగ్ మోడె అజయ్ దేవగన్ సినిమా ‘భోలా’ సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూసిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. సినిమా బాగోలేదని, డబ్బు వృధా అయ్యిందని భర్త భార్యతో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. సినిమా హాలు బయట భార్యను కొట్టి చంపేస్తానని భర్త బెదిరించాడు. దీంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను కొట్టి, బెదిరించాడంటూ భర్తపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో మహిళ గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.

ఇది ఇలా ఉంటే.. భర్త భార్యను కొట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఈ సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు సహాయం చేశారు. అయితే భార్యకు సాయం చేసేందుకు వచ్చిన పోలీసులను భర్త కొట్టిన ఘటన థానే జిల్లాలోని కళ్యాణ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here