తల్లిదండ్రుల తర్వాత రాహుల్‌ గాంధీయే.. కన్నడ నటి దివ్యస్పందన కీలక వ్యాఖ్యలు

0
44

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి లోక్‌సభ మాజీ సభ్యురాలు, కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కన్నడ టాక్ షో వీకెండ్ విత్ రమేష్ సీజన్ 5 ఎపిసోడ్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా దివ్య స్పందన తన తండ్రిని కోల్పోవడం గురించి మాట్లాడారు. ఆమె జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పారు. తనకు తన తల్లిదండ్రులే ప్రాణమని.. తండ్రి చనిపోయిన రెండు వారాలకే పార్లమెంట్‌లో అడుగుపెట్టాల్సి వచ్చిందని.. ఈ నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాల గురించి తన కొత్త అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏమీ తెలియనప్పటికీ ప్రతీదీ నేర్చుకున్నానని ఆమె తెలిపారు. బాధను పనివైపు మళ్లించానని.. అంతటి శక్తిని మాండ్యా ప్రజలే ఇచ్చారని దివ్య స్పందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. జీవితంలో తనను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్‌ గాంధీయే ఉంటారన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయానని.. అలాంటి కష్ట సమయంలో రాహుల్‌ గాంధీ తనకు అండగా నిలబడి సహాయం చేశారన్నారు. మానసికంగా ధైర్యం నూరిపోసి సపోర్ట్‌ చేశారని చెప్పుకొచ్చారు.

దివ్య స్పందన 2012లో యువజన కాంగ్రెస్‌లో చేరారు. ఆమె 2013 ఉప ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్‌గా పనిచేసిన ఆమె ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. గత సంవత్సరం, ఆమె చిత్ర పరిశ్రమకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. “మీలో చాలామంది ఊహించినది నిజమే – నేను మళ్లీ సినిమాలు చేయబోతున్నాను!! అయితే ఈసారి నేను నా బోటిక్ ప్రొడక్షన్ హౌస్ యాపిల్ బాక్స్ స్టూడియోస్ ద్వారా కూడా సినిమాలను నిర్మిస్తాను” అని నటి దివ్య స్పందన ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here