రామకుప్పం ఎస్ఐ వార్నింగ్..ఉన్నతాధికారుల సీరియస్

0
72

ఏపీలో పోలీసులు ఒక్కోసారి శృతిమించుతున్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఓ ఎస్ ఐ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. రామ కుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది. ఎన్ కౌంటర్ చేస్తా అంటూ టీడీపీ కార్యకర్తకు రామకుప్పం ఎస్ఐ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన బెదిరింపులకు పాల్పడిన వీడియో వైరల్ అవుతోంది. కుప్పంలో టీడీపీ కార్యకర్త గజేంద్రకు రామకుప్పం ఎస్ఐ కృష్ణ తీవ్ర బెదిరింపులతో ఫోన్ కాల్ చేశారు. తాను పెట్టిన కేసు రిజిస్టర్ చేయమని అడిగినందుకు గజేంద్రపై బూతులతో విరుచుకుపడ్డాడు ఎస్ ఐ కృష్ణ. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా…దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు ఎస్ఐ. ఎన్ కౌంటర్ చేస్తా నా కొడకా అంటూ టీడీపీ కార్యకర్తను బెదిరించాడు ఎస్ఐ. వైరల్ గా మారింది ఎస్ఐ ఫోన్ సంభాషణ.

పోలీసుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఎస్ ఐ సిఫారసు మేరకు నెల రోజుల్లోనే ఏకంగా 34 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు సీఐ శ్రీధర్. మరో నలుగురిపై రౌడీషీట్లు పెట్టేందుకు సిద్దమయ్యాడు ఎస్ఐ. పోలీసుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మాపై కేసులు పెడుతున్నారు.. మరి మేం ఫిర్యాదు చేస్తే.. ఎందుకు కేసులు పెట్టడంలేదని ఎస్సైని ఫోన్‌లో ప్రశ్నించాడు బాధితుడు.. ఇలాగే వ్యవహరిస్తే పీఎస్‌ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నాడు.. దానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎస్సై.. నోటికి వచ్చిన బూతులతో విరుచుకుపడ్డారు.. అయితే, ఆ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో.. వైరల్‌గా మారిపోయింది. కాగా, గతంలో చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పిస్టల్ ఫైర్ చేసి ఎస్‌ఐ కృష్ణయ్య సస్పెండ్‌ అయినట్టుగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here