ఆర్టీసీ సమ్మెకు, 50మంది ఆర్టీసీ కార్మికుల చావుకు కారణం బాజిరెడ్డి గోవర్ధన్ కాదా : రేవంత్‌ రెడ్డి

0
27

నిజమాబాద్ డిచ్ పల్లి కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ కమీషన్లను వదలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మెకు, 50మంది ఆర్టీసీ కార్మికుల చావుకు కారణం బాజిరెడ్డి గోవర్ధన్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల చావులపై హత్యా నేరం కింద బాజిరెడ్డి గోవర్ధన్ చర్లపల్లి జైలులో చిప్ప కూడు తినిపించాలని ఆయన అన్నారు. మంచిప్ప ప్రాజెక్టు కు బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణ ఆపకపోతే.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత డిజైన్ ప్రకారమే 21 ప్యాకేజీ పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు కానీ..పేపర్ లీకులు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ లో పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయంలో కట్టిన కొండెం చెరువు ప్రాజెక్టు 0.8 టీఎంసీల సామర్థ్యం 70 శాతం పనులు పూర్తయ్యాయని, రూ. 300 కోట్లతో ఆరు నెలలు పనిచేస్తే నిజామాబాద్ జిల్లాలో 1,80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండే అన్నారు. కవిత చెప్పిందో సీఎం దూరాశ పుట్టిందో తెలియదు, మెఘా కంపెనీ వారు చెప్పారో తెలియదు కానీ ఒక్క ఎక్కరం సాగు విస్థీర్ణం పెరుగకపోయినా రూ.3500 కోట్లకు అంచనా పెంచారు అన్నారు. కాంగ్రెస్ హయంలో 0.8 టీఎంసీల నిర్మాణంకు రైతులు 150 ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 తండాలను ముంపుతో రిడిజైన్ పనులు చేపట్టిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here