Robberies in Eluru District: హడలెత్తిస్తున్న దొంగలు.. ఏలూరు వాసుల హడల్

0
85

ఏలూరు జిల్లాలో దొంగలు రూటు మార్చారు. ఒకప్పుడు తాళాలు వేసి ఉన్న ఇళ్లతోపాటు, ఊరికి దూరంగా వుండే ఇళ్లలో మాత్రమే చోరీలకు పాల్పడే దొంగలు ఇప్పుడు ఇంటి యజమానులు ఉన్న సమయంలోనే బరితెగిస్తున్నారు. టార్గెట్ చేసిన ఇళ్లల్లో యజమానులు వుండగానే విలువైన వస్తువులు దోచుకుపోతున్నారు.

ఏలూరు పరిసర గ్రామాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. ఒకప్పటిలాగా పెద్దపెద్ద ఇళ్లను టార్గెట్ చేయడం ఎవరూ లేని సమయంలో దోచుకుపోవడం చేసేవారు. ఇపుడు ట్రెండ్ మార్చిన దొంగలు ఇంట్లో అందరూ ఉండగానే వారి మత్తు వదిలేలోపు విలువైన వస్తువులని కొల్లగొడుతున్నారు. ఏలూరులో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే దీనికి ఉదాహరణ. ఒకే వీధిలో వరుస ఇళ్లలో అర్ధరాత్రి దొంగలు ప్రవేశించడం యజమాను నిద్రిస్తున్నారు గదులకు తాళాలు వేసి ఉన్నదంతా దోచుకుపోతున్నారు. గత 15 రోజుల్లో ఏలూరులో ఆరు ఇళ్లల్లో ఇదే తరహా చోరీలు చోటు చేసుకోవడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలికిడి అయిందని లేచి చూసే లోగా ఉన్నదంతా ఉడ్చుకుపోతున్నారు. పైగా దొంగలను పట్టుకుందామని ప్రయత్నిస్తే అప్పటికే వారు చోరిచేసిన ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడంతో బాధితులు దొంగలను గుర్తించలేకపోతున్నారు. కనీసం పక్క ఇళ్లవారికి సమాచారం అందించినా వారు అదే పరిస్థితిలో ఉంటున్నారని బాధితులు వాపోతున్నారు.

గతంలో ఎవరూ లేని ఇళ్ళలో చోరీలు చేయడం సహజమే అయినా.. ఇపుడు ఇళ్ళలో యజమానులు ఉండగానే దొంగలు రెచ్చిపోవడం చూస్తుంటే వాళ్ళును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకెంతటి దారుణాలకు పాల్పడతారోననే అనుమానాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఏలూరులోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వరుగా ఇళ్ళలో చోరీలకు పాల్పడే గ్యాంగులు జనాల మద్యనే తిరుగుతుండటం ఆందోళణ కలిగిస్తోంది. జనావాసాల మద్య దొంగలు ఇంతలా రెచ్చిపోతుంటే ఇక ఊరికి దూరంగా ఉండే ఇళ్ళను ఇంకెంత లూటి చేస్తారోఅనే అనుమానం కలుగుతోంది.

ఏలూరు పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న చోరీలపై పోలిసులు ప్రత్యేక దృష్టి పెట్టామని చెబుతున్నా వారిని పట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఊరికి వెళ్లేవారు సమాచారం ఇస్తే సిబ్బంది పర్యవేక్షణలో గస్తి ఉంటుందని చెబుతున్నారు. కానీ యజమానులు ఇళ్ళలో ఉండగానే దొంగలు చోరీలకు పాల్పడటంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.ఇప్పటికే ప్రత్యేక బృందాలతో చోరీ గ్యాంగుల కోసం వేట మొదలు పెట్టామంటున్నారు. పోలిసులు నిఘా కొనసాగుతూనే ఉన్నా.. దొంగలు మాత్రం తమపని తాము యథేచ్చగా చేసుకుంటూ పోతున్నారు. ఒకసారి ఒక ఏరియాపై ఫోకస్ పెట్టిన దొంగలు అక్కడ పనిపూర్తి చేసుకుని వెళ్లిపోతూ పోలిసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఈవిషయంలో పోలిస్ సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here