జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ దగ్గర రన్ ఫర్ పీస్ కార్యక్రమం రెండవ ఎడిషన్ జరగనుంది. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనుంది.
అక్టోబర్ 2న రన్ ఫర్ పీస్ లో భాగంగా 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు విభాగంలో రేస్ లు నిర్వహించనున్నారు. కొండాపూర్ లోని బొటానికల్ గార్డె్న్ లో ఉదయం ఐదుగంటలనుంచి పదిగంటల మధ్యలో ఈ రేసులు జరుగుతాయి.
ఈకార్యక్రమంలో ఎక్కువమంది పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆరోగ్యానికి నడక, పరుగు ఎంతో దోహదపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందరిలో అవగాహన పెంచేందుకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొననున్నారు.