విడాకులు తీసుకోబోతున్న సానియా దంపతులు.. కారణం అదే ?

0
64

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి 2010లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇజాన్ అనే కొడుకు ఉన్నాడు. వీరి పెళ్లి టైం లో అనేకమంది విమర్శలను ఎదుర్కొంది సానియా. అంతేకాకుండా పలువురు రాజకీయ నేతలు కూడా ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమకు హద్దులు ఎల్లలు ఉండవని నిరూపించింది సానియా మీర్జా. పన్నెండు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుందట. దీంతో వీరిద్దరు విడిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సానియా షోయబ్ విడిపోతున్నారని ఇంటర్నెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా జీవిస్తున్నారని కొడుకు ఇజాహాన్ కి మాత్రమే తల్లిదండ్రులుగా ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏమిటో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా బలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంతవరకు ఈ విషయంపై మాత్రం వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు. తనదైన ఆటతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది సానియా మీర్జా. డబుల్స్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆమె ఖాతాలో ఆరు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ పొజిషన్ కి చేరుకున్న ఏకైక భారతీయుల మహిళ కావడం మరో విశేషం. 2007లో సానియా 27వ ర్యాంకు కూడా చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here