కరోనా రెండో బూస్టర్ డోస్‌పై ప్రభుత్వ వర్గాలు ఏమన్నాయంటే..

0
402

చైనాతో పాటు పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. దేశంలో కొవిడ్‌ వ్యాప్తిని పరిశీలిస్తోంది.

అయితే ప్రపంచ దేశాల్లో వ్యాప్తి దృష్ట్యా రెండో బూస్టర్‌పై చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ప్రస్తుతానికి రెండో బూస్టర్ డోస్‌ అవసరం లేదని పేర్కొన్నాయి. మొదటగా దేశంలో ఇప్పటికే ప్రారంభించిన బూస్టర్ డోస్‌ డ్రైవర్‌ను పూర్తి చేయాలని తెలిపాయి. ఇప్పటి వరకు మన దేశంలో 220.11 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

 మంగళవారం తాజా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో ఇవాళ 134 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 2,582 కి తగ్గాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు (4,46,78,956) నమోదైంది. ఈ రోజు వరకు కోవిడ్ బారినపడి మృతిచెందిన మొత్తం మృతుల సంఖ్య 5,30,707గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా నమోదు కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 0.13 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. కోవిడ్‌ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,45,667 కు పెరిగింది. కరోనా సోకిన వారిలో 1.19 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here