ఆర్ధిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న భార్య భర్తల మిస్సింగ్ కేసులో మిస్టరీ కొనసాగుతుంది.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు…నిజంగానే ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్లిపోయారా అనే అనుమానాలు పోలీసులకు తలెత్తాయి..సంఘటన స్థలం వద్ద కేవలం భర్త చెప్పులు మాత్రమే లభించడం, కాలువ గట్టు పై నుండి దూకిన ఆనవాళ్ళు కానీ లభించకపోవడం తో పోలీసులు తమదైనా శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు… ఉదయం నుండి కాలువలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన ఎటువంటి ఆధారాలు లభించలేదు…దీంతో మిస్సింగ్ కేసు మిస్టరీ గా మారింది…అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..సీసీటీవీ పరిశీలించడం తో పాటు, కాల్ డేటా కూడా కీలకంగా మారనుంది….