చందనోత్సవం వివాదంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

0
83

ప్రముఖ దేవాలయం సింహాచలంలో తాజాగా ఏర్పడిన చందనోత్సవం వివాదం ఇంకా వీడలేదు. దేవస్థానం అధికారుల వైఫల్యాలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతరాలయ దర్శనాలు 10 వేలని చెప్పి 20 వేలకు పైగా టిక్కెట్లు జారీచేశారు. పరిమితికి మించి వివిఐపీ టిక్కెట్ల జారీతో లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంది ఉత్సవ కమిటీ. సమన్వయం లోపంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేలాదిమంది భక్తులు.. ఘాట్ రోడ్ జామ్, గంటలకొద్దీ దర్శన సమయం, కనీస వసతుల కల్పించక పోవడంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు.

సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై భక్తులు మండిపడ్డారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తులు బారిగేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణకు భక్తుల నుంచి నిరసన సెగ ఎదురుకాక తప్పలేదు. క్యూ లైనల్లోనే భక్తులు నిరసనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.

భక్తులు నిరసన సెగలతో దేవాదాయమంత్రి కొట్టు సత్యనారాయణ పోలీస్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చందనోత్సవం నిర్వహణపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది అని ఆయన అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో ఆచారాలు మంటగలిపి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.. ఈరోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనే బాధ కలుగుతుంది అని విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారు..ఇటు విపక్షాలు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here