టీఎస్పీఎస్సీ చైర్మన్‌ సహా సభ్యులకు సిట్ నోటీసులు

0
59

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బోర్డు ఛైర్మన్‌తో పాటు సభ్యులను ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. బోర్డు కార్యదర్శి సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేశారు. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేష్, మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించేందుకు సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు షమీమ్, రమేష్, సురేష్‌లను బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అరెస్టు చేశారు. అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రవీణ్ ప్రశ్న పత్రాన్ని అందించినందున, దానిని వాట్సాప్‌లో షేర్ చేయడంతో… తాము చేశామని, మరెవరికీ ఇవ్వలేదని షమీ, సురేష్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. రాజశేఖర్‌తో ఉన్న స్నేహం వల్లే ప్రశ్నపత్రం ఇచ్చారని రమేష్ తెలిపారు.

 

 

అయితే.. ఇప్పటివరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్‌-1 పేపర్లు ఐదుగురికి లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 15కు చేరగా.. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి, అతని బావమరిది ప్రశాంత్‌రెడ్డితో పాటు నిందితుల సంఖ్య 16కు చేరింది. అయితే.. తాజాగా సిట్‌ అధికారులు.. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరిని విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వీరి బాధ్యతలు ఏంటి? ప్రశ్నపత్రాల రూపకల్పనలో వీరి పాత్ర ఎంత వరకు ఉంటుంది? అలాగే కంప్యూటర్లకు సంబంధించి యాక్సెస్ వీరికి ఉంటుందా? లేదా? ఇలా అనేక అంశాలపై వివరాలు తెలుసుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here