మాజీ సీఎం కాన్వాయ్ పై రాళ్ళు రువ్వడం ఎక్కడైనా చూశామా?

0
71

వైసీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. యర్రగొండపాలెం ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని దౌర్భాగ్యకరమైన పరిస్థితులను ఈ అరాచక వైసీపీ ప్రభుత్వంలో చూడాల్సి వస్తోంది.ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ పై రాళ్లు విసరడం, భద్రతా సిబ్బంది తలలు పగలగొట్టడం ఎప్పుడైనా చూశామా..?ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేబినెట్ మంత్రి చొక్కా విప్పేసి రోడ్లపైకి వచ్చి ఏం సందేశమిస్తున్నారు..?

మంత్రి చొక్కా ఇప్పడం అంటే జగన్ ప్రభుత్వం కూడా బట్టలిప్పేసినట్టే.గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేశారు.ఏనాడైనా ఇలాంటి దురదృష్టకర ఘటనలు చూశామా..?కుప్పంలో దాడి చేస్తారు.. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసానికి పాల్పడతారు.ఏకంగా జెడ్ ఫ్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం ఇంటిపైకే దాడికి యత్నిస్తారు.అసలు ఈ రాష్ట్రం ఏమైపోతోంది.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ల కంటే ఏపీలో పరిస్థితులు దిగజారిపోతుండటం బాధాకరం అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పటికే చేసిన హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు మీ సైకో మనస్తత్వ ఆకలి తీర్చలేదా..?రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వమే ప్రజల బట్టలిప్పేలా కనిపిస్తోంది. యర్రగొండపాలెం ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here