శాసనసభ ను రణసభగా మార్చొద్దన్నారు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు. అమరావతి…. శాసనసభ ను రణసభగా మార్చొద్దని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు హితవు పలికారు. ఈమేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. ఈరోజు శాసనసభ లో జరిగిన సంఘటన లు ప్రజాస్వామ్య వాదులను బాధపెడుతుందన్నారు.చట్టసభలు చర్చలు మాత్రమే జరగాలి అప్పుడు సభ హుందాతనం కనపడుతుంది.. అయితే అందుకు భిన్నంగా ఒకరికొకరు తోపు లాట జరిగితే ప్రజలకు చట్టసభలంటే ఏం సందేశం ఇస్తున్నారని సోమువీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసన సభ గౌరవం కాపాడాలని ఈరోజు జరిగిన సంఘటన పై సోమువీర్రాజు స్పందన ప్రకటనలో పేర్కొన్నారు
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఇవాళ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు… వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజాలపై టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్యల ఫిర్యాదు… అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరిపి.. ఎడిటింగ్ చేయని వీడియో ఫుటేజ్ పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్యేల వినతి… పోలీస్ స్టేషనుకు వచ్చే ముందు తుళ్లూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్నించారు.
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజాలపై టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్యల ఫిర్యాదు.మంత్రి కార్మూరి.. వెలంపల్లి పైనా తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ.అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరిపి.. ఎడిటింగ్ చేయని వీడియో ఫుటేజ్ పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్యేల వినతి.పోలీస్ స్టేషనుకు వచ్చే ముందు తుళ్లూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ ఎమ్మెల్యేలు