కర్రలతో వంతెన.. గ్రామస్తుల కష్టాలకు చెక్

0
527

తమ కుటుంబానికి, సమాజానికి ఏదో చేయాలని సంకల్పంతో ముందుకెళుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో వాగులు ఎక్కువగా వుంటాయి. వాటిని దాటటం చాలా కష్టం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఎన్నికల వేళ అధికారులు, వివిధ పార్టీల నేతలు వచ్చి ఓట్లడిగి, తీరా ఎన్నికలయ్యాక వారి గోడును పట్టించుకోలేదు. మహారాష్ట్ర లో యువకులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది.

తమ ప్రయాణ కష్టాలను అధిగమించడానికి వారంతా నడుం బిగించారు.. చేయి చేయి కలిపారు. వారు తయారుచేసిన కర్రల వంతెన అందరినీ ఆకట్టుకుంటోంది. అసలే అటవీ ప్రాంతం వాగుపై కట్టిన కర్రల వంతెన కలర్ ఫుల్ గా వుంది. గడ్చి రోలి జిల్లా భామ్రాగర్ లోని గుండెనూర్ లో వాగుపై వంతెన ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాకపోకల కోసం ప్రతి సంవత్సరం ఇలా వంతెనలు ఏర్పాటు చేసుకుంటున్నారు స్ధానికులు.

వాగులో పిల్లర్ల కోసం వెదురు, బ్రిడ్జి కోసం కలప వినియోగించారు యువకులు. బాగా గట్టిగా వుండేలా ఏర్పాటుచేసుకుంటున్న వంతెన మీద నుంచి ద్విచక్రవాహనాలు, సైకిళ్లు వాడుతున్నారు. అయితే, ఇలాంటి వంతెనలపై భారీ వాహనాలకు అవకాశం వుండదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలంటున్నారు. ఈ వంతెనతో తమ కష్టాలు తీరాయంటున్నారు. చూశారా.. అధికారులు వచ్చి ఏదో చేస్తారని కాకుండా తమ శ్రమదానంతో తమ ఇబ్బందులకు వారే చెక్ పెట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here