బైరాన్‌పల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రేపు బండి సంజయ్ వస్తా అంటున్నారని.. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటమని బీజేపీ వక్రీకరించిందని ఆయన ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని, మీకు నిజంగా సాయుధ పోరాటంపై చిత్తశుద్ది ఉంటే అమరుల కుటుంబాలకు సహాయం చేయండని ఆయన అన్నారు. వారికి పెన్షన్లు మంజూరు చేయండని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై కూడా వ్యాఖ్యలు చేశారు.. బైరాన్‌పల్లి పోరాటంలో 300 మంది అమరులైతే 30 మందికే పెన్షన్లు ఇస్తున్నారని, తెలంగాణ ఉద్యమం బైరాన్‌పల్లి గ్రామ స్పూర్తిగా చేస్తామని సీఎం అన్నారని ఆయన అన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని సీఎం చెప్పారని, ఏడాదికోకసారి అమరవీరుల వర్థంతి ఘనంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బైరాన్‌పల్లి బురుజు శిథిలావస్థకు చేరిందని.. పురావస్తుశాఖ పట్టించుకోవాలన్నారు తమ్మినేని వీరభద్రం.