కోలుకుంటున్న తారకరత్న.. లిక్విడ్స్ పంపుతున్న వైద్యులు

0
746

బెంగళూరు నారాయణ హృదయాలయలో నటుడు తారకరత్నకు వైద్యం అందుతోంది. విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఉందంటూ నిన్న హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు NH వైద్యులు. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాలతో సపోర్టు తో చికిత్స కొనసాగుతోంది.. ఏక్మో సపోర్టు తారకరత్నకు అందించలేదని నారాయణ హృదయాలయ వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్న పరిస్థితిని కుటుంబానికి నిరంతరం తెలియజేస్తున్నామన్నారు వైద్యులు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Bangalore Narayana Hrudayalaya) ఆసుపత్రికి ఒక్కొక్కరుగా వెళుతున్నారు. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తూ ఉండడంతో లిక్విడ్స్ పంపుతున్నారు.

బాలకృష్ణ (Bala Krishna) దగ్గరుండి మరీ తారకరత్నను (TarakaRatna) చూసుకుంటున్నారు. శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కూడా తారకరత్నకు చికిత్సనందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబీకులకు సూచించారు. భర్తకు గుండెపోటు రావడం, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుమిలిపోతున్న తారక రత్న భార్య అలేఖ్యారెడ్డిని ఓదార్చుతూ, ధైర్యం చెబుతూ చల్లా భార్య సుప్రియారెడ్డి కూడా బెంగళూరులోని ఆసుపత్రిలోనే ఉన్నారు.

మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు May you have a long and healthy life dear Tarakaratna! అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here