లూటీ చేయడానికే విశాఖలో కాపురమా? అని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. నాగేళ్లలో విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు మింగారు..2 లక్షల కోట్లు ప్రజా సొమ్ము దోచేసిన మిమ్మల్ని మించిన పెత్తందారు ఎవరు?
జగన్ను మించిన పేదల ద్రోహి ఎవరున్నారు..?సంతబొమ్మాళిలో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల స్టంటే.నాలుగేళ్లుగా గుర్తుకురాని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడే గుర్తుకువచ్చిందా? ఇప్పటివరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో వివరాలు బహిర్గతం చేసే దమ్ము జగనుకు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో బలహీనవర్గాలకు ముందునుంచీ అండదండలు ఇచ్చింది టీడీపీయే అన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రతి ఒక్కరు నడుంబిగిద్దాం.. మన హక్కులను కాపాడుకుందాం..తెలుగుదేశం 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది..బలహీన వర్గాలకు వివిధ పధకాలు టిడిపి హయాంలోనే తీసుకువచ్చాం.ఆంద్రప్రదేశ్ లో ఇంకా కొన్ని కులాలు వెనుకబడే ఉన్నాయి..దేశ… రాష్ట్ర జనాభాలో అత్యధికులు బి.సి.లే..అయితే మనలో ఐకమత్యం లేదు.
అందుకే ఎదగలేకపోతున్నాం..రాజకీయ పార్టీలు వేరైనా మనుషులు వేరైనా..అందరూ కలిసికట్టుగా ఉండాలి..తెలుగుదేశం పార్టీ అధికారం..లో ప్రతిపక్షంలో ఉన్నా ఐకమత్యంతో ఉంది..ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుది ఒకే నినాదం బలహీన వర్గాలు ఎదగాలన్నారు. ఈరోజుకి మనం కులవృత్తుల మీదనే బతుకుతున్నాం..జగన్ మోహన్ రెడ్డికి బలహీన వర్గాలంటే కోపం..ఎందుకంటే బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉంటారనీ..నాలుగు సంవత్సరాలలో 54 కార్పోరేషన్లు ఇచ్చారంటారు..ఒక్కపైసా కూడ నిధులివ్వలేదు..ఈ ప్రభుత్వంపై బలహీన వర్గాల తరపున మాట్లాడితే మా మీద కేసులు, అరెస్టులు..బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశం ఇచ్చేందుకు కృషిచేస్తాం..మీ అందరి సలహాలు తీసుకుని మ్యానిఫేస్టోలో పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు.