నిమ్మకూరులో చంద్రబాబు టూర్.. కొడాలి నాని ఏమంటారో?

0
72

ఈనెల 12 నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా ఉంటుంది. అలాంటిది చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటన అనడంతో అంతటా ఉత్కంట నెలకొంది. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్లతో అసెంబ్లీకి రానంటూ సవాల్ విసిరాక తొలిసారిగా గుడివాడలో పర్యటించనున్నారు చంద్రబాబు. తొలిసారిగా నిమ్మకూరులో బస చేయనున్నారు చంద్రబాబు. కైకలూరు పార్టీ ఇన్ఛార్జీ నియామకంపై క్లారిటీ ఇస్తారా అనే అంశంపై టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి. 12వ తేదీన నూజివీడు, 13వ తేదీన గుడివాడలో బాబు రోడ్ షోలు ఉంటాయి. 13వ తేదీ రాత్రికి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు బస చేస్తారు. 14వ తేదీన బందరులో రోడ్ షో నిర్వహిస్తారు, తమ అధినేత పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here