ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ నేతలు ఏమన్నారంటే?

0
145

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు పరాకాష్ట అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ చేసిన అరాచకాలు..దుర్మార్గాలకు విద్యావంతులు తగిన బుద్ది చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వచ్చాయి.. మేము ఒక్కరే అని సజ్జల అంటున్నాడు..టీడీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే అందరూ మాతో ఉన్నారు..వైసీపీ నాయకుల మాటలు విని దారుణాలకు పాల్పడిన పోలీసు అధికారులను వదిలిపెట్టం అన్నారు సోమిరెడ్డి.

ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పరాకాష్ట అన్నారు. ఏ పార్టీలు.మాతో వచ్చినా కలుపుకుంటాం.అందరితో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.మంత్రి కాకాణి, వై.సి.పి. ఎం. ఎల్.సి. అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిల మధ్య డబ్బుల విషయంలో సజ్జల జోక్యం చేసుకున్నారు.అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రి కాకాణి దూరంగా ఉన్నాడన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మథనం ప్రారంభం అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి శుభం పలికారు. అధికారంలో ఉన్నామా..? అనే అనుమానం సజ్జలకు కలగడం శుభ పరిణామం.రెండు రోజుల ముందే ప్రజలు ఉగాది పంచాంగం చెప్పారని చంద్రబాబు కామెంట్ చేశారు.. ఆ వ్యాఖ్యలను సజ్జల ఎండార్స్ చేశారు.ఈ రాష్ట్రంలో అరాచకమే ఉందని ప్రజలెప్పుడో గుర్తించారు.. ఆ ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైనాట్ 175 అనే గొంతులు మూగబోయాయి.ప్రజలు.. ప్రజాస్వామ్య అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవు. వైసీపీ డిక్షనరీలో లేని పదాలను సజ్జల మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు.

ఒక్క షాకుతోనే ప్రజలురర సజ్జలకు గతాన్ని గుర్తు చేశారు.. ప్రజలనే పదాలను గుర్తు చేశారు. బుల్డోజ్ అనేది వైసీపీ ఇంటి పేరు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం బుల్డొజ్ చేయడం కాదా..?ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని మేం నమ్ముతున్నాం.. మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నాం.మీ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎంకే నమ్మకం లేదు.. అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారు..? ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి.. మా సంఖ్యా బలం 23.మా దగ్గరున్న ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు..?పోటీ చేయడాన్ని కూడా తప్పు పడతారా..?మీ ఓటర్లు వేరా..? ముఖం మీద ఎవరూ మేం ఫలానా ఓటరని స్టిక్కర్ వేసుకుంటారా..?పులివెందుల నుంచి ఓ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలిచారు.. త్వరలో మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచి గెలవబోతున్నారు.ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను పెంచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here