బాలికలతో అర్ధనగ్న నృత్యాలు వేయించి.. వీడియోలు తీసిన టీచర్ అరెస్ట్

0
131

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు.. కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని బాలికల చేత బలవంతంగా అర్ధనగ్న డ్యాన్స్‌లు చేయించాడు. వాటిని వీడియోలు తీసి మరీ ఆనందించాడు ఆ టీచర్. స్కూల్​లో​ జరిగిన ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పవద్దని వారిని కొట్టి మరీ బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్‌సింగ్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రామ్‌సింగ్‌ మార్చి 11న 4, 5వతరగతి చదువుతున్న కొందరు బాలికలతో పాఠశాల గదిలో బలవంతంగా అర్ధనగ్నంగా నృత్యాలు చేయించాడు. ఆ బాలికలు చేసిన నృత్యాలను ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని కర్రతో కొట్టి మరీ బెదిరించాడు. అయితే ఓ బాలిక భాదపడుతూ తన తల్లితో జరిగిన విషయం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఆమె ఉపాధ్యాయుడిపై ఆగ్రహంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆమె బాధిత కుటుంబీకులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామ్​సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్​ చేసి.. చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here