Telangana Cabinet Meeting: బడ్జెట్‌ను ఆమోదించేందుకు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనుంది. బడ్జెట్ పై చర్చించిన తర్వాత.. ఆమోదించనుంది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో.. బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేయనున్నారు సీఎం కేసీఆర్..
ఇక, పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు కేసీఆర్.. అయితే, కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తప్ప ఎజెండాలో ఇతర అంశాలు ఏమి లేవని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు.. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 7న అసెంబ్లీకి సెలవు. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పనున్నారు. 9,10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. సభ గ్రాంట్స్ ను అమోదించనుంది. వచ్చే ఆదివారం 12న ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది… రెండో శనివారం, ఆదివారం కూడా సభ జరగనుంది..