యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. అయితే నిన్న, మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసులు.. తాజాగా తగ్గు ముఖం పట్టాయి. అయితే తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,205 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 476 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అయితే.. అత్యధికంగా హైదరాబాదులో 239 కొత్త కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 26 చొప్పున కేసులు నమోదయ్యాయి.
వీటితో పాటు.. కరీంనగర్ జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,28,471 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,20,597 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇంకా రాష్ట్రం ప్రస్తుతం.. 3,763 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.