తెలంగాణలో మళ్లీ వెయ్యిదాటిన కరోనా కేసులు

0
1023

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరోసారి వెయ్యి దాటడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 43,318 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,061 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు నమోదుకాగా.. రంగారెడ్డి జిల్లాలో 63, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, నల్గొండ జిల్లాలో 51, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 43 చొప్పున కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,23,724 మంది కరోనా బారినపడగా, వారిలో 8,13,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం 6,357 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here