తోట్లవల్లూరు సీఐ, ఎస్ ఐ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే మీరు షాక్

0
576

ట్లవల్లూరులో సంచలనం సృష్టించిన ట్రైయగల్ మర్డర్ కేసులో పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు,తోట్లవల్లూరు ఎస్ఐ అర్జున్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు…కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో అక్రమసంబంధంతో సాఫ్ట్​వేర్‌ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్యకు గురయ్యాడు. తన స్నేహితుడి ద్వారా పరిచయం అయినా అదే గ్రామానికి చెందిన మిథున అలియాస్‌ జ్యోతితో అతని స్నేహితుడైన శ్రీకాంత్‌రెడ్డికి వివాహేతర సంబంధం ఉండేది.

వీరి మధ్య వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని శ్రీకాంత్ రెడ్డి చంపేశాడు….ఈ కేసును నీరుగార్చి, రాజీ చేస్తానని భద్రిరాజుపాలెం గ్రామానికి నరేంద్రరెడ్డి తెరపైకి వచ్చాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఖర్చు అవుతుందని నిందితుడి తండ్రిని సంప్రదించాడు. ఈ మేరకు వారి మధ్య డీల్‌ కుదిరింది. తొలి విడతగా కేసును విచారిస్తున్న సీఐతో 22 లక్షలకు మాట్లాడుకున్నాడు. ఈమేరకు సీఐకు నరేంద్రరెడ్డి డబ్బులు అందజేశాడు. ఇంతలో.. ఇదే గ్రామానికి చెందిన పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి విషయం తెలిసి రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కలిశాడు…..తాను 20 లక్షలకే రాజీ చేస్తానని నిందితుడితో చెప్పాడు. దీనిని పసిగట్టిన నరేంద్రరెడ్డి.. తన డీల్‌కు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించి పథకం ప్రకారం హత్య చేసాడు…ఈ కేసు విచారణలో పోలీసుల డీల్ బయటకు రావటంతో ఇప్పుడు కటకటాల పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here