మంత్రి రోజా డ్యాన్స్ తో లంబసింగిలో సందడే సందడి

0
808

ఏపీ మంత్రి ఆర్ కె రోజా విశాఖ పర్యటనలో బిజీగా వున్నారు. ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. మంత్రి ఆర్కే రోజా మరోసారి డాన్స్ తో అదరగొట్టారు. ఆంధ్రా కాశ్మీర్ లంబ సింగి పర్యటనలో ఫోక్ డాక్స్ కు స్టెప్పులు వేశారు. కూలింగ్ గ్లా సెస్ పెట్టుకుని థింశా కళాకారుల తో కలిసి ఆడిపాడారు రోజా. మంత్రిగారి ఉత్సాహం చూసి పర్యాటకులు కేరింతలు కొట్టారు. అంతకు ముందు ఏపీ టూరిజం నిర్మించిన రిసార్ట్స్ ప్రారంభించారు మంత్రి. సుమారు మూడు కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూర్తయింది. ఆంధ్రా కాశ్మీర్ లంబ సింగిలో మంత్రి రోజా సందడి హాట్ టాపిక్ అవుతోంది. థింసా కళాకారులతో కలిసి నృత్యం చేశారు మంత్రి రోజా., ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. మంత్రి రోజా డ్యాన్స్ చేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.

అంతకుముందు రోజా టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్ కె రోజా. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు మావే అన్నారు రోజా. లంబసింగి వెళుతూ నర్సీపట్నంలో రాయల్ పార్క్ రిసార్ట్స్ లో మీడియాతో మాట్లాడారు పర్యాటక మంత్రి రోజా. సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను రద్దు చేసేస్తామన్న టిడిపి ఇప్పుడు మాటను మార్చిందన్నారు.

జగన్ వల్ల రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు విశ్వసించారు.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం పలు సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారు. కోవిడ్ అనంతరం పర్యాటకం పుంజుకుందన్నారు. యూత్ ఫెస్టివల్ నిర్వహణ వల్ల యువకుల్లో ప్రతిభ బయటకు వస్తుంది. ప్రకృతి అందాలు దెబ్బ తినకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. టెంపుల్ టూరిజం లో దేశంలోనే ఏపీ మూడో స్థానం సాధించిందన్నారు మంత్రి రోజా. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. స్వదేశీ దర్శన్, ప్రసాద స్కీమ్ లో ఉమ్మడి విశాఖకు నాలుగు ప్రాజెక్టులు మంజూరయ్యాయని మంత్రి రోజా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here