సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెప్టెంబర్‌ 3న టీఆర్‌ఎస్‌ఎల్పీ

0
131

సెప్టెంబర్ 3న తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్యాబినెట్‌ మీటింగ్‌ తరువాత తెలంగాణ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (టీఆర్‌ఎస్‌ఎల్పీ) సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు పార్టీ శ్రేణుల వెల్లడించాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెల్లడించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు,తదితర అంశాలపై, సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే రేపు సీఎం కేసీఆర్‌ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. బీహార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయలుదేరి వెళతారు సీఎం కేసీఆర్‌. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేసి, అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన పన్నెండు మంది కూలీల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here