చీర కోసం సిగపట్లు.. అట్లుంటది మరి లేడీస్‌తో..

0
83

మహిళలకు షాపింగ్‌ అంటే పిచ్చి.. నచ్చిన నగలు మెడలో ఉండి.. మెచ్చిన చీరను ధరిస్తే.. వారి ఆనందమే వేరుగా ఉంటుంది.. ఇక, చీరల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతారు.. ఇదే సమయంలో.. ఎక్కడైనా డిస్కౌంట్‌ సేల్‌ నడుస్తుందంటే అస్సలు వదలరు.. తక్కువా? ఎక్కువా? కాదు.. డిస్కౌంట్‌ వచ్చిందంటే చాలా సంతోషంగా ఫీలవుతారు.. అయితే, బెంగళూరులోని ఓ శారీ సెంటర్‌ డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది.. అక్కడ జరిగిన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. చీర కోసం జుట్లుపట్టుకుని కొట్టుకున్న మహిళల వీడియో ఇప్పుడు నెట్లింట్లో వైరల్‌గా మారిపోయింది..

డిస్కౌంట్‌ ధరలతో ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించారు.. అయితే, అసలే డిస్కౌంట్‌పై చీరలు కొనే అవకాశం రావడంతో.. కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి క్యూ కట్టారు. తమకు నచ్చిన చీరలను బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టారు. కానీ, ఆ షాపులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. అంతే, ఇంకేముంది.. ఆ చీర నాకు కావాలంటే.. నాకు కావాలంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. మాటలతో మొదలై.. తోపులాటకు దారి తీసింది.. ఆ తర్వాత ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లింది.. ఏదేమైనా లేడీస్‌ గొడవలోకి వెళ్లొద్దని చెబుతుంటారుగా.. ఆ ఇద్దరు మహిళలను అదుపు చేసేందుకు సిబ్బంది ఎంతో కష్టపడాల్సి వచ్చింది.. అయితే, ప్రతీ చేతిలో ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌.. అందులో కావాల్సినన్ని సోషల్‌ మీడియా యాప్‌లు ఉండడంతో.. ఆ దృశ్యాలను బంధించి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.. ఇంకేముందు.. ఫన్నీ కామెంట్లు పెడుతూ.. నెటిజన్లు షేర్‌ చేస్తుండడంతో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here