ఏపీలో జీవో నెంబర్ ఒకటిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఒకవైపు కోర్టులో వాదనలు కొనసాగాయి. అటు విపక్షాలు కూడా జీవో నెంబర్ 1 ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జీఓ నం. 1 పై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ జీవోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రస్తావనను అమలు చేయాలని కోర్టును ఆశ్రయించాం అన్నారు. 2020లో పిటిషన్ వేస్తే నిన్న విచారణకు వచ్చింది. నిన్నటి నుంచి జీవో నెంబర్ 1పై విచారణ జరుగుతుంది.
పోలవరం అంశం కోర్టులో ఇవాళ కూడా విచారణకు రాలేదు. పోలవరం కేంద్రమే పూర్తి చేసి అప్పచెప్పాలనే మా వాదన. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు జీవో నెంబర్1 ఉపయోగపడుతుందన్నారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిడి ఉంటే ఏ యాత్ర అయినా సూపర్ సక్సెస్ అవుతాయి. ఇదిలా ఉంటే జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేయాలని కోరారు టీడీపీ తరపు న్యాయవాది. అయితే హైకోర్టు అందుకు నిరాకరించింది. మొత్తం మీద జీవో నెంబర్ 1 పై హైకోర్ట్ ఏం తేలుస్తుందోనన్న ఉత్కఠ నెలకొంది.