తాగుబోతు కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి

0
65

సాధారణంగా మనుషులకు జీవిత ఖైదు విధించడం గురించి విన్నాం. కానీ కోతికి జీవిత ఖైదు విధించడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అవును.. కోతి తాను చేసిన నేరానికి ఇప్పుడు జీవిత ఖైదు అనుభవిస్తోంది. శిక్షా కాలంలో ఏకంగా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‎లోని కాన్పూర్‌ లో ఓ కోతి ఇప్పుడు అలాంటి జైలు శిక్షే అనుభవిస్తోంది. అసలే కోతి.. ఆపై కల్లు తాగింది అన్న నానుడి అనుగుణంగా తోక ఉంది కదా కనపడిన ప్రతి వారిపైకి గెంతింది. ఇంకేముంది.. ఇంకెలాగ ఎగురుతావో ఎగురు అన్నట్లు తీసుకెళ్లి బోనులో పెట్టారు. జీవితాంతం బయటకి రాకుండా కట్టడి చేశారు. ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపుర్‌లో ఓ మాంత్రికుడు కాలియా పేరుతో కోతి సాకుతుండేవాడు. తాంత్రికుడు తాను మద్యం సేవిస్తూ కోతికి కూడా అలవాటు చేశాడు. దీంతో మద్యానికి బానిసైన కోతి 2017లో తాంత్రికుడు చనిపోయిన తర్వాత మద్యం తాగించే వాళ్లు లేకపోవడంతో మద్యం కోసం రోడ్లపై వెళ్లే వారిపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా 250మందిని గాయపరిచింది. అంతే కాదు మద్యం తాగేందుకు మద్యం దుకాణాల దగ్గరకు వెళ్లి అక్కడ తాగుతున్న వారి చేతుల్లోని బాటిళ్లు, గ్లాసులను లాక్కొని పారిపోయేది. దీంతో కోతి చేష్టలను భరించలేకపోయిన స్థానికులు, మద్యం షాపు యజమానులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కోతిని అతికష్టం మీద బంధించారు. మద్యం తాగుతూ జనంపై దాడి చేస్తోందని కాన్పూర్‌ జూలో బంధించారు. కోతిని మానసిక వైద్యుడికి చూపిస్తూ ట్రీట్‌మెంట్ చేయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here