సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆరంభం

0
707

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్యన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి ప్రారంభం అవుతుందని ముందే ప్రకటించారు. సికింద్రాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ వర్చువల్ గా రైలు సర్వీసులను ప్రారంభించారు. ఇక బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే, దీనికి సంబంధించి ఛార్జీల వివరాలు బయటకొచ్చాయి. రేపు సోమవారం (జనవరి 16) నుంచి జరిగే ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో.. టికెట్ కేటగిరీల్లో రెండు రకాలు చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ అనేవి ఉన్నాయి. కాగా.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు టికెట్ ధర ఎంత ఉందో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర అంతే లేదు. ఇక చైర్ కార్.. ఎగ్జిక్యుటివ్ చైర్ కార్ టికెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది.
బేస్‌ ఫేర్‌ రూ.1,207
* రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40
* సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45
* మొత్తం జీఎస్టీ రూ.65
* రైల్లో ఇచ్చే ఫుడ్‌కి రూ.308
ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఇవాళ ప్రారంభం అయ్యే రైలు ఆరవది. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వేశాఖ. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయి విశాఖపట్నం చేరుకుంటుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

ఒక్క రోజు మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. అందరికి పరిచయం కావాలనే ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్లలో ఆపుతున్నారు. సంక్రాంతి పండగరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ కానుకగా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here