పవన్ తన రథాన్ని రెడీ చేయించారు. మిలటరీ ట్రక్ తరహాలో ఓ వాహనాన్ని రెడీ చేయించుకుంటున్నారని ముందుగానే వార్తలు వచ్చాయి. అవి నిజమని పవన్ ట్వీట్ ద్వారా బహిర్గతం అయ్యాయి. వారాహి వాహనం ఫోటోలను పవన్ షేర్ చేసారు. ఫొటోలు షేర్ చేయడం సంగతి సరే, ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో మాత్రం పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఈ రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. యుద్దానికి వారాహి సిద్దం అనే టైటిల్ లో వీడియో వదిలారు. కావాలని తన బాడీ గార్డ్ లను మిలటరీ జవాన్లు మాదిరిగా చూపించడం విశేషం. మిలటరీ ట్రక్, దానికి ఇరు వైపులా సైనికుల మాదిరిగా గార్డులు కవాతు చేస్తున్నట్లు ఓ వీడియో తయారు చేసి వదిలారు. జనసేన సైనికులు ఈవీడియో తయారుకోసం ఎంతగా శ్రమపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పైగా మిలటరీ కలరింగ్ రావడానికి ఇవి మాత్రం సరిపోవు అని సెక్యూరిటీ గార్డ్ లకు పంజాబీల మాదిరిగా గెటప్ లు వేయడం గమనించవచ్చు. సినిమాల్లో లాగే పవన్ కు గబ్బర్ సింగ్ తరహాలో అనేక ఫాంటసీలు వున్నాయి. తుపాకులు. మిలటరీ. నక్సల్ యూనిఫారమ్..ఇలా చాలా ఫాంటసీలు వున్నాయి. రాబోయే ఎన్నికలు మాత్రం మామూలుగా వుండవనే సంకేతం ఈ వాహనం ద్వారా తెలియచేశారు పవన్.