రాజన్న, మల్లన్న ఆలయాల్లో భక్తుల సందడి

0
40

కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగుతోంది . తెల్లవారుజామున
భక్తులు ఆలయం ముందు రావిచెట్టు వద్ద భక్తులు కార్తిక దీపాలు వెలిగించి తమ భక్తీ ని చాటుకున్నారు.కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారికి అభిషేకములు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతు షష్టి పూజలు పరివార దేవతార్చనలు వేదమంతాలతో ఆలయ అర్చకులు నిర్వహించారు.

అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సందర్భంగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనానికి క్యూలైలలో బారులు తీరారు స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఈసందర్బాంగ భక్తులు స్వామివారి ప్రీతిపాత్రమైన కోడే మొక్కలు చెల్లించి స్వామివారికి అభిషేకములు, అన్న పూజలు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి ఆలయం ముందు భాగంలో కార్తీకదీపాలు వెలిగించి తమ మొక్కలు చెల్లించుకున్నారు.

పరమ పవిత్రమయిన కార్తీక మాసం త్వరలో ముగియనుంది. దీంతో ఇవాళ శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. శ్రీగిరి మల్లన్న ఆలయం ముక్కంటీశుని దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు భక్తులు. శ్రీశైలంలో కార్తీకమాసం నాలుగోవ చివరి సోమవారం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టే అవకాశముంది.

భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాఢవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ముందస్తు ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలంకార దర్శనం ఏర్పాటు వలన త్వరగతిన దర్శనాలు పూర్తవుతున్నాయి. 23 వ తేదీతో కార్తీక మసోత్సవాలు ముగియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here