శ్వేత మృతి కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ

0
81

విశాఖపట్నంలో గర్భిణి శ్వేత మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేశారా? అనే విషయంలో పెద్ద సస్పెన్స్‌ కొనసాగింది.. ఈ కేసులో శ్వేత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కీలంగా మారింది.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత.. ఈ కేసులో కొన్ని షాకింగ్‌ విషయాలను మీడియాకు వెల్లడించారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ.. శ్వేత అనే అమ్మాయి మృత దేహం YMCA బీచ్ లో లభ్యం అయింది.. శ్వేతది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. శ్వేత ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ.. శ్వేత భర్త కొద్ది రోజుల క్రితం ఉద్యోగం రీత్యా హైదరాబాద్ కి వెళ్లాడు.. సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్యలో భర్త తో మాట్లాడింది.. 8 గంటలకి తిరిగి భర్త ఫోన్ చేశాడు.. 8:15 కి శ్వేత తల్లి రమాదేవికి అత్తింటివారు సమాచారం ఇచ్చారని తెలిపారు.

ఇక, ‘శ్వేతపై అత్తింటి వేధింపులు నిజమే.. శ్వేత తల్లి ఎదుటే దంపతులు గొడవపడ్డారు.. ఆమె కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉంది.. ఆ భూమి తన పేరు మీదకి మార్చాలి అని మణికంఠ ఇబ్బంది పెట్టాడు.. అత్త, మామ చిన్నచూపు చూడడంతో శ్వేత మనస్తాపానికి గురైంది’’ అని సీపీ వివరించారు. ఫిబ్రవరిలో ఒక సారి శ్వేత ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందన్న ఆయన.. అత్తింటివారి వేధింపులు కారణంగా గతంలో ఆత్మహత్యకి పాల్పడిందన్నారు.. బీచ్‌ దగ్గర మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. శ్వేత భర్త, ఆడపడుచు భర్తపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. శ్వేత చెప్పులు 100 మీటర్లు దూరంలో లభ్యం అయ్యాయి.. కానీ, శ్వేత ఒంటి పై ఎటువంటి గాయాలు లేవు.. పోస్ట్‌మార్టం వీడియో గ్రఫి చేయించామని తెలిపారు. శ్వేత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు, ఆడపడుచు భర్త మీద గృహ హింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల కేసులు పెట్టాం.. ఐపీసీ సెక్షన్ 354, 498(a) కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.

మరోవైపు బీచ్ లో దొరికిన బట్టలు శ్వేతవి కావని స్పష్టం చేశారు సీపీ.. సుమారు 12 గంటల సమయంలో శ్వేత ఆత్మహత్యకి పాల్పడింది అని అనుకుంటున్నామన్న ఆయన… శ్వేత ఆడపడుచు భర్త సత్యం (భర్త మణికంఠ బావ).. పెళ్ళైన కొన్ని నెలల తర్వాత నుండి శ్వేత బాడీ షేమింగ్ గురుంచి కంపేర్ చేయడం, వల్గర్ గా మాట్లాడడం, లైంగికంగా వేధించేవాడని.. శ్వేత తల్లి రమా దేవి వద్ద గతంలో చాలా సార్లు వాపోయిందని పేర్కొన్నారు.. భర్త ఎదురు గానే చాలా సార్లు కామెంట్ చేసేవాడు.. సూసైడ్ లెటర్ లో ఇన్ డైరెక్ట్ గానే ఇంట్లో ఏమి జరుగుతుందో నీకు తెలుసు.. అని చెప్పకనే చెప్పిందన్నారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here