గురు నానక్ విద్యా సంస్థలలో ముగిసిన వింటర్ ఫెస్ట్ ‘బ్రూమస్ ఫీస్టా’

0
1112

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం లోని గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్, గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు గురునానక్ యూనివర్శిటీ (జి.ఎన్.ఐ.టి, జి.ఎన్.ఐ.టి.సి & జి.ఎన్.యూ),డిసెంబర్ 30 & 31 ౨౦౨౨ తేదీల్లో క్యాంపస్ లోని ఓపెన్ ఆడిటోరియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు రోజుల వార్షిక ఈవెంట్ వింటర్ ఫెస్ట్ ‘బ్రూమస్ ఫిస్టా’ని విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించాయి. ఈ కార్యక్రమం గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ మరియు గురు నానక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
విద్యార్థులు ‘నేర్చుకోవడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి, టీమ్ బిల్డింగ్ నైపుణ్యాలను అవగాహన చేసుకోవడానికి మరియు వారు సరదాగా గడపడానికి’ దీనిని ఒక వేదికగా గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ అందించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మరియు తద్వారా స్టార్టప్‌లను చేపట్టడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ ప్రారంభోపన్యాసంతో వింటర్ ఫెస్ట్ ప్రారంభమైంది. గురునానక్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ మరియు గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్ సైని, యూ ఐ ఈ టి -జి.ఎన్.యూ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ, జి.ఎన్.ఐ.టి.సి డైరెక్టర్ డాక్టర్ కె. వెంకట్ రావు, జి.ఎన్.ఐ.టి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ రెడ్డి మరియు జి.ఎన్.ఐ.టి.సి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. పార్థసారధి కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.


వింటర్ ఫెస్ట్ గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థుల బహుముఖ ప్రతిభను ప్రదర్శించే అద్భుతమైన మరియు సంతోషకరమైన కార్యక్రమం. విద్యార్థులను మరియు అధ్యాపకులను చైతన్యవంతం చేసేందుకు, వారి ప్రతిభను చాటేందుకు ఫ్లాష్ మాబ్, మిస్టర్ అండ్ మిస్ డిమినర్, సింగింగ్, ఇన్‌స్ట్రుమెంటల్ అండ్ సోలో, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గ్రూప్ డ్యాన్స్‌లు, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, థంబ్ ఫైట్, అంతాక్షరి తదితర పోటీలు జరిగాయి. ‘యువ ఉత్సవ్ & ఖేలోత్సవ్-2022’ పేరుతో కింద ఈ రెండు రోజుల్లో బాలబాలికల కోసం అనేక ఆటలు మరియు క్రీడలు నిర్వహించబడ్డాయి క్రికెట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్ మరియు త్రో బాల్‌లలో విద్యార్థినీ విద్యార్థులకు ఇండోర్ మరియు అవుట్‌డోర్ గేమ్స్ నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ వింటర్ ఫెస్టివల్ విద్యార్థుల ప్రతిభను పెంచేదిగానే కాక వినోదాన్ని పంచేదిగా ప్రాధాన్యత కలిగి ఉంది.

గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్, వైస్-ఛాన్సలర్-జి.ఎన్.యూ మరియు మేనేజింగ్ డైరెక్టర్-జి.ఎన్ఐ, డైరెక్టర్ జి.ఎన్.ఐ.టి.సి మరియు ప్రిన్సిపాల్-జి.ఎన్.ఐ.టి ద్వారా విజేతలు మరియు రన్నరప్ విద్యార్థులందరికీ బహుమతులు ప్రదానం చేయబడ్డాయి. గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్‌లోని విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఫెస్ట్ అద్భుతంగా విజయవంతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here