మహారాష్ట్రలో దారుణం.. ప్రియుడి చేతిలో వివాహిత హత్య

0
83

అనైతిక సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. అంతేకాకుండా వీటి వల్లే ఎక్కువ క్రైం రేటు కూడా పెరిగిపోతుంది. ఆ సంబంధాల మోజులో పడి చాలామంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నాగపూర్ పరిధిలోని దిఘోరీకి చెందిన 42 ఏళ్ల మహిళ 40 ఏళ్ల వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకుంది. ఆమె ఇతనితో కాకుండా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె ప్రియుడు అనుమానించాడు. ఇది అతనికి నచ్చలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మార్చి 23న ఆమెను హింగానా భూభాగంలోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ వారికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ఆమెను రాయితో కొట్టాడు. ఈ క్రమంలోనే మహిళ కనిపించడం లేదంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాగ్‌పూర్‌లో ఓ మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు. వాథోడా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల శ్వేత (పేరు మార్చాం) అనే మహిళ గత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత, హింగనా ప్రాంతంలోని బన్వాడి శివర్ వద్ద అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైంది. నిందితుడిని వాథోడా పోలీసులు అరెస్టు చేశారు. శ్వేతకు అంతకు ముందే పెళ్లయింది. భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలోనే దీపక్ ఇంగ్లే అనే 40 ఏళ్ల వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండేది. దీపక్ స్టార్ బస్‌లో డ్రైవర్. శ్వేత అతనితో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడేది. అతను కూడా ఆమె ఇంటికి వస్తున్నాడు. అన్నయ్య అని ఇంట్లో చెప్పుకునేవాడు. ఆమె వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని దీపక్ అనుమానించాడు. దాంతో అతనికి కోపం వచ్చింది. మార్చి 23న శ్వేతను రుయ్ శివారా వద్దకు తీసుకెళ్లాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో దీపక్ శ్వేత నుదుటిపై ఎడమవైపు బలంగా కొట్టి హత్య చేశాడు.

శ్వేత అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మార్చి 24న వాథోడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దీపక్ నేరం అంగీకరించాడు. వారం రోజుల క్రితం కూడా దీపక్ శ్వేతను ఆ అడవికి తీసుకెళ్లాడు. కానీ, అతను చంపుతాడని ఆమె ఊహించలేదు. మార్చి 23న దీపక్ అడవిలో శ్వేతను హత్య చేశాడు. రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here